HomeAndhra Pradeshపీజీఆర్ఎస్ కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతుంది: జిల్లా కలెక్టర్

పీజీఆర్ఎస్ కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతుంది: జిల్లా కలెక్టర్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలోని పిజిఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పి జి ఆర్ ఎస్ (గ్రీవెన్స్) కు వచ్చిన సమస్యల దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా పోలవరం జిల్లా కలెక్టర్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం రెవి న్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ కు వచ్చిన త్రాగునీటి సమస్యలు, గర్భిణీ స్త్రీల సమస్యలు, రహదారు ల సమస్యలు, అంగన్వాడి కేంద్రంలోని సమస్యలు అదేవిధంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలలోని మౌలిక సదుపాయాల సమస్యల దరఖాస్తు లను వచ్చిన వెంటనే ఆయా దరఖాస్తుదారునితో సంప్రదించి సమస్య లు పరిష్కారం కొరకు సంబంధిత శాఖలు సమన్వయం పనిచేసి పరిష్కరించాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని మారుమూ ల గ్రామాలకు సంబంధించిన ప్రజల సమస్యల దరఖాస్తులు పరిష్కరిం చే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత దరఖాస్తు దారినితో ఫోన్లో సంప్రదించి సమస్యలు పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాల ని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వారి కార్యాలయం నుండి ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా దరఖాస్తుదారునికి ఫోన్లు రావడం జరుగుతుం దని అదేవిధంగా ఐ వి ఆర్ ఎస్ కాల్ రాకముందే సంబంధిత దరఖా స్తుదారినీతో ఫోన్లో మాట్లాడి నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్క రించాలని ఆయన అన్నారు. ప్రతి దరఖాస్తుకు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం సమస్యలు పరిష్కారం కొరకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. పీజీ ఆర్ఎస్కు వచ్చిన సమస్యల దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ కు వచ్చిన దరఖాస్తులు ముఖ్యమంత్రి వారి కార్యాలయం నుండి, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పీజీ ఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తులన్నీ ఎప్పటికప్పుడు వార వారం ఆడిట్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి దరఖాస్తుకు ప్రభుత్వ నిబంధన ప్రకారం దరఖాస్తుదారుని అర్హతను బట్టి ఒకటికి రెండుసార్లు పరిశీలించి దరఖాస్తులు పరిష్కరించాలని ఆయన అన్నారు.పోలవరం జిల్లాలోని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రభుత్వ శాఖలలో ఎన్ని పీజిఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవి మండలాల వారిగా ఆయన ఆరా తీశారు.పి జి ఆర్ ఎస్ కు వచ్చిన దరఖాస్తులను సమస్యల పరిష్కారం కొరకు యాక్షన్ టేకెన్ రిపోర్టులు సమర్పించాలని ఆయన అన్నారు. ఆయన ఆదేశించారు . పోలవరం జిల్లాలోని మంజూరైన వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ షేక్ షరీఫ్,డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్.దాసరి రత్నాకరరావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్,జిల్లా విద్యాశాఖ అధికారి జి.శ్రీరామ్ మూర్తి , జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవదానం, పీహెచ్ఓ నరేంద్ర కుమార్,జిల్లా మత్స్యశాఖ అధికారి దిల్షాద్,జిల్లా మలేరియా అధికారి భాస్కర రావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ.శ్రీనివాసరావు, అచ్చుతాచారి, పి డి డ్వామా రామ్ ప్రసాద్, సిపిఓ వెంకట్రావు,జిల్లా ట్రెజరీ అధికారి కుమా ర్, డిసిహెచ్ఎస్ సాంబశివరావు,పిఏఓ ఎల్.రాంబాబు, డిప్యూటీ తహసిల్దార్లు శ్రీధర్, రవీంద్రబాబు,శివ, శ్రీరామచంద్రమూర్తి,డిఈలు పి. వెంకటరమణ, చైతన్య, శివ, సుబ్బారావు,ఆర్టీవో రాజేష్ కుమార్,సబ్ రిజిస్టర్ ఉపేంద్ర,ఐటీడీఏ ఏవో ఎర్రంశెట్టి రాజు, ఏపీవో జనరల్ డిఎన్వి రమణ ఎల్డిఎం ప్రదీప్,సిడిపిఓలు క్రాంతి కుమరి, ప్రత్యూష,డిప్యూటీ ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్ సాలెం రాజ్,డిపిఎం జి.నాగభూషణరావు, తాసిల్దారులు సిహెచ్ బాలాజీ, అమ్మాజీ, సరిత,సిహెచ్ శ్రీనివాసరావు, శివ,కరక సత్యనారాయణ, తేజస్విని ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular