HomeAndhra Pradeshతుఫాను ప్రభావానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, ప్రజలను అప్రమత్తం చేసిన ఎపీఐసిసి...

తుఫాను ప్రభావానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, ప్రజలను అప్రమత్తం చేసిన ఎపీఐసిసి డైరెక్టర్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: తుఫాన్ ప్రభావంతో విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాజవొమ్మంగి మండలంలోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి పిలుపునిచ్చారు. ఈక్రమం లో ఎమ్మెల్యే చూసనలు మేరకు ఏపీఐఐసీ డైరెక్టర్ మరియు రాజవొ మ్మంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు రాజవొమ్మంగి మండలంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాల కారణంగా ప్రజలు ఎవరు కూడా అత్యవసరం పరిస్థితి సమయంలో తప్ప బయటకు రావద్దని ఆయన కోరారు. అంతేకాకుండా కుంభవృష్టిగా పడుతున్న వర్షాలు వల్ల ప్రజలు ఎవరు కూడా ఏ విధమైన అసౌకర్యాలకు గురి కాకుండా ప్రజలకు స్థానికంగా ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు సహకరిం చాలని పెద్దిరాజు కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నా క్రమంలో వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు విరమించుకోవాలని ఆయన కోరారు. ఈదురు గాలుల దాటికి విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడే ప్రమాదం ఉందని, కరెంటు స్తంభాల దగ్గర, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ప్రజలు ఎవరూ వెళ్ళరాద ని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్థానిక సచివాలయ, పోలీసు సిబ్బందికి లేదా తమ కూటమి నేతలకుగాని సమాచారం ఇవ్వాలని గొల్లపూడి పెద్దిరాజు కోరారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments