HomeAndhra Pradeshపాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు:జేసీ ప్రశాంత్ కుమార్

పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు:జేసీ ప్రశాంత్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో తుఫాను, భారీ వర్షాల పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించాల్సిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (డీ-వార్మింగ్ డే) కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో తుఫాను ప్రభావం, వర్షాల పరిస్థితులు అదుపులోకి వచ్చిన అనంతరం మరో రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. వాయిదా వేసిన నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని పరిస్థితులను సమీక్షించిన అనంతరం తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments