HomeUmmadi Alluri Zillaరంపచోడవరంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

రంపచోడవరంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో

వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం మన వృత్తిపరమైన విధులకు భగవద్గీత వంటిదని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే రాజ్యాంగ పరిషత్ ఏర్పడి, ఎంతో మంది మేధావులు ప్రతి అక్షరం పై లోతుగా చర్చించి మనకు ఒక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. అంబేద్కర్ గారి అపారమైన కృషిని స్మరించుకుంటూ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు 1970లో ఓటు హక్కు కల్పిస్తే, మన దేశంలో మాత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే కుల, మత, లింగ, అక్షరాస్యత భేదాలు లేకుండా అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించడం మన రాజ్యాంగ గొప్పతనమని వివరించారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ఆశయాలకు అనుగుణంగా అధికారులందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ డి. పృథ్వీరాజ్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ డి. బి.ఎన్. రత్నాకర్ రావు, డీపీఓ జి. భాస్కర్, ఐసీడీఎస్ పీడీ కె. ఉమతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments