HomeUmmadi Alluri Zillaరీ-సర్వే పురోగతిపై సమీక్షా సమావేశం

రీ-సర్వే పురోగతిపై సమీక్షా సమావేశం

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లా సమగ్ర రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలనీ సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశించారు.శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు పృద్వి రాజ్ కుమార్,నరేంద్ర పడల్ కలిసి రీ-సర్వే పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో మండలాల వారీగా రీ-సర్వే పనుల పురోగతి, తహసీల్దార్ల లాగిన్,సబ్ కలెక్టర్ లాగిన్,జాయింట్ కలెక్టర్ లాగిన్ ప్రక్రియలు,భౌతిక రికార్డుల పరిశీలన, పెండింగ్‌లో ఉన్న గ్రామాల వివరాలను సమీక్షించడం జరిగిందని జిల్లాలో మొత్తం 157 గ్రామాలకు సంబంధించి తహసీల్దార్ లాగిన్ పురోగతిని,107 గ్రామాలకు సంబంధించిన సబ్ కలెక్టర్ లాగిన్ వివరాలను, జాయింట్ కలెక్టర్ లాగిన్ పురోగతిని అధికారుల వారీగా పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు.అలాగే జాయింట్ కలెక్టర్ లాగిన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న గ్రామాలు,భౌతిక రికార్డుల పరిశీలన, ధ్రువీకరణకు సంబంధించిన అంశాలను సమీక్షించి పెండింగ్‌లో ఉన్న రీ-సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు,గ్రామాల వారీగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సవరణలు చేపట్టి, లాగిన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. సర్వే కి సంబంధించిన ఈ కేవైసీ ఏ విధంగా చేయుచున్నది సర్వే నెంబర్ల ఆధారంగా రికార్డుల ఆధారంగా సర్వేకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ హద్దులు ప్రభుత్వ హద్దులు క్షుణ్ణంగా సర్వే చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణంరాజు, డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, తహసీల్దార్లు సి హెచ్ బాలాజీ, అమ్మాజీ,సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఏ. సత్యనారాయణ,ఈడీఎం నగేష్,పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments