పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు సమష్టిగా కృషి చేయాలనీ పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గాంధీబాబు,జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్,సబ్ కలెక్టర్లు పృద్వి రాజ్,నరేంద్ర పడల్,అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహల నిర్ములన దినోత్సవం పురస్కరించుకొని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ (బాల్య వివాహ రహిత భారత్) కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ముఖ్యంగా బాలికల విద్య,ఆరోగ్యం, మానసిక వికాసానికి ఆటంకం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 4, 2026 న తీర్మానించడం జరిగిందని అదేవిధంగా పోలవరం జిల్లా లో నవంబర్ 27 ఈ రోజు అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహల నిర్ములన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.గ్రామస్థాయిలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.బాలల హక్కులను పరిరక్షిస్తూ ప్రతి బాలబాలికకు విద్య,సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ కలెక్టర్ తెలిపారు.పోలవరం జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు,స్వచ్ఛంద సంస్థలు,ప్రజలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో బాల్య వివాహాల రహిత జిల్లాగా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన అన్నారు.18 సంవత్సరాల నిండకుండా ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ గాని ఐసిడిఎస్ అధికారులకు గాని తెలియజేయాలని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం 23 సంవత్సరాలు దాటిన తర్వాత డిగ్రీ అయిన వెంటనే తల్లిదండ్రులు చేసిన వివాహాలను చేసుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో బాల్య వివాహాలు ఇంకా అక్కడక్కడ జరుగుతున్నావని అందుకు ప్రతి గ్రామంలో బాల్య వివాహాలు నిర్మూలనకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. బాల్య వివాహాలు జరిగితే దేశ అభివృద్ధి కొంతవరకు కుంటుపడుతుందని ఆయన తెలిపారు. బాల్యవివాహాలు చేసిన తల్లిదండ్రులకు ఆయా గ్రామాలలో కొంచెం దూరం పెట్టాలని ఆయన అన్నారు.బాల్య వివాహాలు నిర్మూలన కొరకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని ఆయన అన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా లాయర్లు, డాక్టర్లు,ఇంజనీర్లు తదితర చదువులు చదివి ముందంజలో ఉండాలని ఆయన అన్నారు. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి.గాంధీబాబు మాట్లాడుతూ పోలవరం జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించి,ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం,భద్రత అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నదనీ ఆయన అన్నారు.పోలవరం జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుకు సమిష్టి కృషి చెయ్యాలని ఆయన తెలిపారు.ప్రతి బాలికకు కనీసం పాఠశాల విద్య పూర్తయ్యేలా చర్యలు తీసుకోవలని బాలిక చదువు మధ్యలో ఆపకుండా చూడలని ఆయన అన్నారు.బాల్యవివాహాలను నిర్వహించే, ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవలని ఆయన అన్నారు.ప్రతి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల భాగస్వామ్యంతో ముందస్తు నిఘా ఏర్పాటు చెయ్యాలని ఆయన తెలిపారు.బాల్యవివాహం నుంచి రక్షించిన ప్రతి బాలికకు విద్య,ఆరోగ్యం, మానసిక ఆరోగ్య సహాయం, పునరావాసం తప్పనిసరిగా కల్పించాలని ఆయన అన్నారు.బాల్యవివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యతఅని బాల్యవివాహం గురించి సమాచారం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. చదువు వయసులో ప్రేమలలో దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి పెట్టి ఉన్నతమైన చదువులు చదవాలని ఆయన అన్నారు ఆయన అన్నారు.ఎలెక్ట్ సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలించే విధంగా జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలో నవంబర్ 27వ తారీఖున ప్రపంచ బాల్యవివాహాల దినోత్సవం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కొరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించి వాళ్లు పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.ఉమా, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్,మహిళా సంఘాలు, మహిళలు,వివిధ పాఠశాలలకు సంబంధించిన బాలికలుఎలెక్ట్ సంస్థ అధికారి శ్యాం కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ మంగతాయారు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి కలెక్టర్: దినేష్ కుమార్
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
