HomeAndhra Pradeshఅక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: మంత్రుల భేటీలో నారా లోకేశ్

అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి క్లీన్ స్వీప్ చేయాలి: మంత్రుల భేటీలో నారా లోకేశ్

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయవాడలో పలువురు మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయని… ఎన్నికలు జరగవనే ఎలాంటి అపోహలు ఎవరికీ వద్దని ఈ సందర్భంగా కూటమి శ్రేణులకు ఆయన స్పష్టతనిచ్చారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా వేగంగా పరిష్కరించుకుని, అన్ని స్థానాల్లో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక పోరులో కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు సన్నద్ధం కావాలని, సీట్ల అంశంపై కూటమి సమన్వయ కమిటీ, అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా ఆధారాలతో బయటకు వస్తుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ నిరుద్యోగులకు ఎంతో మేలు చేసిన మెగా డీఎస్సీపై నిందలు వేస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద క్రీడా కోటా ఉపాధ్యాయులపై గూండాలతో దాడులు చేయించి మీసాలు మెలేసిన వారు, పోలీసులు చట్టప్రకారం కేసులు నమోదు చేయగానే పరారయ్యారని ఎద్దేవా చేశారు. గురువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments