HomeUncategorizedతాడేపల్లి లోని మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన...

తాడేపల్లి లోని మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వీసం


నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
తాడేపల్లిలో ఉత్తరాంధ్ర,గ్రేటర్ విశాఖపట్నంనేతలు, ప్రజాప్రతినిధులు తో మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం కీలక భేటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిశీలకులు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా వీసం ను జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలుకరించి రాబోయే జివియంసి,తోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు ల్లో విజయమే లక్ష్యం గా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులందరిని సమన్వయముతో కలుపుకొని సమిష్టిగా కృషి చేస్తున్న వీసం రామకృష్ణ ను అభినందించారు.అలాగే పాయకరావుపేట నియోజకవర్గం లో నియోజకవర్గం ఇంచార్జ్ కంబాల జోగులు తో పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేయాలని తెలిపారు . ఉత్తరాంధ్ర అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని ఇప్పుడు వరకు జరిగిన అభివృద్ధి వైసిపి ప్రభుత్వం లోనే జరిగిందని దాన్ని ప్రజలు ఎల్లపుడు గుర్తుపెట్టుకుంటారని నాయకులు అందరు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పై నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments