HomeUncategorizedప్రతి మంగళవారం 500 మందికి ఉచిత అన్నదానం

ప్రతి మంగళవారం 500 మందికి ఉచిత అన్నదానం

జనసేనాని పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో.. సొంత నిధులతో తుమ్మలపల్లి రమేష్ సేవా కార్యక్రమం

కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 22: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రమేష్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని తన సొంత నిధులతో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, అవసరంలో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందిస్తూ వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు.అన్నదాన కార్యక్రమానికి వచ్చిన వారితో రమేష్ ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments