అమరావతి జిల్లావాణీ ప్రతినిథి: 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఊహించని రీతిలో అత్యంత ఘోర పరాజయం పాలైంది. తాను ప్రవేశపెట్టిన పథకాలు మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఊహించుకున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పాదయాత్ర చేయాలన్న ఆలోచనను నిర్మించుకొని ముందు క్షీణించిన పార్టీ పరిస్థితిని బలోపేతం చేయడానికి జగన్ ఆలోచనలో పడ్డట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని పూర్తి స్థాయిలో చక్కదిద్దుకొని అనంతరం అప్పుడు ఆ తరువాత పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతో, కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న నేపథ్యంలో పాదయాత్ర చేసిన పెద్దగా ప్రయోజనం చేకూర్చదని భావించి, జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేసే ప్రణాళికలు రూపొందించుకుంటారని, అప్పటివరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని నాయకులు అంటున్నారు. ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే, టీడీపీ నుంచి లోకేష్ కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో గెలుపు కోసం జగన్ పెద్ద ప్లాన్
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
