HomeAndhra Pradeshతెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి...

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి.. పాదయాత్ర త్వరలో ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు…?

అమరావతి జిల్లావాణీ ప్రతినిథి : ఇంకో మూడు సంవత్సరాలలో జగనన్న 2029 ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే మరోసారి వైసీపీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తున్నట్లు సమాచారం అందుతుంది. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ కూడా త్వరలో పాదయాత్ర ప్రారంభించనున్నారని తెలుస్తోంది. వైసిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తే, దానికి ప్రతిగా టీడీపీ నుంచి లోకేశ్ కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా కూటమిని అధికారంలోకి తీసు కొచ్చిన లోకేశ్, జగన్ యాత్రకు కౌంటర్ గా మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తారని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా పాదయాత్ర చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments