పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం డివిజన్ ప్రధాన కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎన్నికల సిబ్బందికి ఏర్పాట్లలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక రంపచోడవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్వీఎస్ ప్రసాద్ ను శుక్రవారం ఉదయం విధుల్లో నుండి తొలగించినట్లు జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తమరావు మీడియా ద్వారా తెలిపారు. ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బందికి మధ్యాహ్నం భోజనం, అల్పాహారం వంటి ఏర్పాట్లలను పూర్తి స్థాయిలో అశ్రద్ధగా వదిలేశారని ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నామని సీఈఓ వివరించారు. విధి నిర్వహణ లోపాలపై నోటీసు జారీ చేసి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం చర్యలు తీసుకున్నామని పురుషోత్తమరావు ధ్రువీకరించారు.
ఎన్నికల నిర్వహణ సిబ్బందిని గాలి వదిలేసిన ఎంపీడీవో సస్పెండ్
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
