HomeAndhra Pradeshవైభవం.. కల్యాణ వెంకన్న రథోత్సవం

వైభవం.. కల్యాణ వెంకన్న రథోత్సవం

తిరుపతి: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఎనిమిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బ్రహ్మరథంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి రథాన్ని భక్తులు గోవింద నామస్మరణలతో లాగుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి బయలుదేరిన మహా రథం గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగి 11.30 గంటలకు ఆలయానికి చేరుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. రథంపైకి ఉప్పు, మిరియాలు చల్లుతూ గోవింద, గోవిందా అంటూ ముందుకు కదిలారు. రథోత్సవానికి ముందు కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments