అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుట్టలో ఐసీడీఎస్ ప్రాజెక్టు రావికమతం సీడీపీవో వి. మంగతాయారు ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ రెండవ, మూడవ సంవత్సరానికి సంబంధించిన మూడు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం రోలుగుంట జెడ్పీ హైస్కూల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులు ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు.అంగన్‌వాడీ కార్యకర్తల్లో విద్య, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు చిన్నారుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే అంశాలపై శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీడీపీవో వి. మంగతాయారు, ఎంఈఓ-2 జగన్న గారు హాజరై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.శిక్షణకు డీఆర్‌పీలుగా ఏ. ఆనందరావు, ఈ. సత్యనారాయణ, ఎం. పెంటారావు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఎస్‌కే గౌహరున్నిసా, ఎన్. హేమావతి పాల్గొన్నారు. రోలుగుంట మండలానికి చెందిన మొత్తం 58 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ మూడు రోజుల శిక్షణలో పాల్గొంటున్నారు.
