HomeAndhra Pradeshకాపు జెఎసి లో మణికుమార్ కు కీలక బాధ్యతలు

కాపు జెఎసి లో మణికుమార్ కు కీలక బాధ్యతలు

తూర్పుగోదావరి జిల్లావాణి ప్రతినిధి: పెంటగట్ల మణికుమార్ కు కాపు జె. ఎ. సి లో కీలక బాధ్యతలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు ఐక్య కార్యాచరణ సమితి ( జేఏసీ) చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు, మణి అన్న బ్లడ్ ఆర్మీ సేవా సంస్థ వ్యవస్థాపకులు పెంటగట్ల

మణికుమార్ కి రాష్ట్ర కాపు జేఏసీ – కమ్యూనిటీ వెల్ఫేర్ రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రక్తదాన సేవల ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ, నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న పెంటగట్ల మణికుమార్ సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించడం జరిగిందని చైర్మన్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన యూత్ అధ్యక్షులు మణికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రోజు మనకోసం – ఒక రోజు జాతి అభివృద్ధి కోసం”* అనే నినాదంతో కాపు జాతి ఐక్యత కోసం, యువతను చైతన్యవంతం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తాను. జాతి అభివృద్ధే నా లక్ష్యం అని తెలిపారు. పెంటగట్ల మణికుమార్ నియామకం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments