మార్చి 4న జర్నలిస్టుల చలో విజయవాడ
జర్నలిస్టుల సమస్యలను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఎపిబిజెఎ) సంయుక్తంగా మార్చి 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమంలో రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా జర్నలిస్టుల ప్రదర్శన, అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ ఉంటాయని తెలిపారు.ఈ సభలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పాల్గొంటారని అయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ఇంటిస్థలాలు కేటాయించాలని, ఇళ్లు కట్టుకునేందుకు తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

