Thursday, April 16, 2026
HomeUncategorizedరహదారి సమస్య పరిష్కారం కోసంమరో ఉద్యమం: సీపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్

రహదారి సమస్య పరిష్కారం కోసంమరో ఉద్యమం: సీపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి:రాజవొమ్మంగి మండలంలో రహదారుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజవొమ్మంగి మండలంలో త్వరలో మరో ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఎం పోలవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం మండలంలోని దుర్గానర్ గ్రామంలో సీపీఎం మండల ముఖ్య కార్యకర్తలు,మండల కమిటీ సభ్యులు సమావేశం పార్టీ మండల కమిటీ సభ్యులు జర్తా రాజు అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.గతంలో రహదారులు నిర్మించాలంటూ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆధ్వర్యంలో గిరిజనులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముట్టడించిన నేపథ్యంలో ఆయా గ్రామాల గిరిజనులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హామీయిచ్చారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన రహదారుల గ్రామాల గిరిజనులతో అలాగే గిరిజనసంఘం నాయకులతో చర్చలు జరిపారు.ఆగిన రహదార్లు నిర్మాణానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు. రాజవొమ్మంగి నుండి బూరుగుపల్లి వెళ్లే 6 కిలోమీటర్ల రహదారి రూ 2.5 కోట్లతో బీటీ రహదారి,అమ్మిరేకుల నుండి కిమ్మలిగడ్డ 5.5 కిలోమీటర్ల రహదారి రూ3.5కోట్లతో, డి మల్లవరం కిలోమీటర్ రహదారికి రూ1 కోటి బిటి రహదారి,కిండ్ర నుండి ముంజవరప్పాడు పాడు వెళ్లే 3.5 కిలోమీటర్ల రహదారి 4 కోట్లతో బీటీ రహదారి, లోదొడ్డి నుండి పాకవెల్లి వెళ్లే రెండు కిలోమీటర్ల రహదారి రూ1 కోటి తో బీటి రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఐ శ్రీనివాసు వెల్లడించారని తెలిపారు. వీటిని డిసెంబర్ 2025 నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ వాటిలో మంజువరపాడు రహదారి ఒకటే పూర్తి అయిందని తెలిపారు. నేటికీ రహదార్లు హామీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో పోరాటమే శరణ్యం అన్నారు.త్వరలో ఉద్యమం తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు.అలాగే గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై సిపిఎం నాయకులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ప్రధానంగా రహదారులు, తాగునీరు,విద్యుత్తు,వైద్యం వంటివి ఉన్నాయని,వాటితో బాటు పింఛన్లు,పెరిగిన విద్యుత్ ఛార్జీలు,పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు వంటి సమస్యలపై గ్రామస్తులను సమీకరించి ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు.అలాగే ఈ నెల 12న కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్తం సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, మండల కార్యదర్శి కొండ్ల సూరిబాబు.పార్టీ మండల నాయకులు టి శ్రీను,పి రామరాజు,పి రాంబాబు,పి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular