Thursday, April 16, 2026
HomeUncategorizedప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ధ్యేయం: రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ధ్యేయం: రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. దరఖాస్తుదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారం పై చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అలాగే ప్రజాదర్బార్ లో పలు సమస్యలు పై ఆమెకు విన్నవించారు. మరియు సింగంపల్లి గ్రామంలో పలు మౌళిక సమస్యలు పై ఆమెకు తెలియజేయగా సంబధిత అధికారులకు చరవాణిలో మాట్లాడి పరిష్కారం చేయాలని ఆదేశించారు. అలాగే పలు గ్రామాల ప్రజలు గృహ నిర్మాణ బిల్లులు మంజూరు, చేతిపంపులు ఏర్పాటు తదితర సమస్యలపై ఆమె దృష్టిలో పెట్టగా ప్రాధాన్యత ప్రకారం పరిష్కారం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభానీ, రంపచోడవరం మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, అడ్డతీగల సొసైటీ చైర్మన్ బుర్లె హరిబాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు, పీసా కమిటి ఉపాధ్యక్షులు దేవగిరి శివ, ఇళ్లా గోపి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular