Saturday, April 18, 2026
HomeUncategorizedజగ్గంపేటలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శిక్షణా తరగతులు

జగ్గంపేటలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శిక్షణా తరగతులు

జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా.. చట్టాలపై అవగాహన కల్పించే దిశగా జగ్గంపేటలో కీలక అడుగు పడింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని NHRP ఫోరం (జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ) బ్రాంచ్ కార్యాలయంలో శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు. వలీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా NHRP ఫోరం సీఈవో మరియు చైర్మన్ తూము రామచంద్ర నాయుడు, అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్ మాధవి లత హాజరయ్యారు.ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు
శిక్షణ ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ సంస్థలో చేరిన ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా శిక్షణ పొందాలనే ఉద్దేశంతో ఈ క్లాసులను నిర్వహించామని, శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు సంస్థ తరపున అధికారిక సర్టిఫికెట్లను జారీ చేస్తామన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలు, మానవ హక్కుల ఉల్లంఘనపై ఎలా స్పందించాలి, చట్టపరమైన రక్షణ ఎలా పొందాలి మరియు సమస్యలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసే విధానాలపై సభ్యులకు నిష్ణాతులు దిశానిర్దేశం చేశారు. శిక్షణానంతరం చైర్మన్ రామచంద్ర నాయుడు మరియు డైరెక్టర్ మాధవి లత చేతుల మీదుగా సభ్యులకు శిక్షణా పత్రాలను అందజేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే ప్రతి కార్యకర్తకు చట్టంపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే మనం బాధితులకు సరైన న్యాయం చేయగలమని, తూము రామచంద్ర నాయుడు, సీఈవో తెలిపారు. ఈ కార్యక్రమానికి కేవలం స్థానికులే కాకుండా బెంగళూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కోనసీమ, పోలవరం మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి రాష్ట్ర, మండల స్థాయి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లా సెక్రటరీ రాఘవతో పాటు పలువురు జిల్లా స్థాయి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దూర ప్రాంతాల నుండి వచ్చి శిక్షణ పొందిన సభ్యులకు, కార్యక్రమ నిర్వాహకులకు, ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular