Thursday, April 16, 2026
HomeUncategorizedAPTF ధర్నా

APTF ధర్నా

జిల్లావాని ప్రతినిజం నర్సీపట్నం.

ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు, పాత తాలూకా కార్యాలయం నందు నర్సీపట్నం జోన్ 6 మండలాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఆర్థికపరమైన, విద్యాపరమైన, సుమారుగా 44 అంశాలు ఉన్నాయినీ, సిపిఎస్ విధానం రద్దు, టెట్ పరీక్ష రద్దు చేయడం,12వ పి ఆర్ సి కమీషన్ ఏర్పాటు చేయడం,1-7-23 నుండి 30% పింట్మెంట్ ఇవ్వాలినీ,.11 పి అర్ సి బకాయిలు చెల్లించాలినీ,యాప్స్ భారం తగ్గాలినీ. ప్రతి ప్రైమరీ స్కూల్ కి 2వ పోస్ట్ విద్యార్థుల రోలుకి సంబంధం లేకుండా మంజూరు చేయాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న 4 డి ఎ లు మంజూరు చేయాలి. ఇంకా అనేక తీరని సమస్య ఉన్నాయి అన్నారు. ఈ ధర్నా లో నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట ఉపాధ్యాయులు సుమారుగా 100 మంది పైగా పాల్గొన్నారని, ఈ కార్యక్రమం లో నర్సీపట్నం జోన్ ఇంచార్జి పడాల అప్పారావు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటపతి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, టి త్రినాధ్, రాష్ట్ర ఉపాధ్యక్షలు, డి.నూకరాజు, ఎస్. దాసు, ఎం జయలక్ష్మి, కె. తమ్మునాయుడు, ఆర్ వి ఎస్ ఆర్ శర్మ, ఎల్ వై పాత్రుడు, సిహెచ్ నర్సిoహమూర్తి, పి.రమణ, కె.అశోక్ సామ్రాట్, ఎన్.శ్రీరామ్మూర్టీ,మల్లే లింగం,రాము, లోవరాజు, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular