Friday, June 5, 2026
HomeUncategorizedవెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించిన ఎలమంచిలి నియోజవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ

వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించిన ఎలమంచిలి నియోజవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ

ఎన్నికల హామీలను. అమలు చేయకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. బుధవారం ఎలమంచిలి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు 1500 ప్రతినెలా వేస్తామని. 50 సంవత్సరాల వయసు దాటిన స్త్రీ పురుషులకు పెన్షన్ ఇస్తామని మోసం చేశారన్నారు. గృహిణులకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని మోసం చేశారన్నారు. ప్లీజ్ రియంబర్స్మెంట్ చేయలేదు అన్నారు. సంవత్సరానికి 25 వేలు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు అన్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయం. హత్యా రాజకీయం చేస్తారని ఆరోపించారు. మామ ఎన్టీ రామారావు వెన్నుపోటు పడడంతో పాటు నేడు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారన్నారు. జవాంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రెండు రాష్ట్రాలు సర్వయోగంగా కీర్తించారు. మాజీ మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమ పాలన జరిగిందన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ కార్యకర్తలకు కష్టం వాటిలితే పార్టీ వెంటనే నడుస్తుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యవసర వస్తువులు ధరలు పెంపు. పెట్రోల్ డీజిల్ పెంపు చేసి అధిక భారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ బోదేపు గోవిందు. అనకాపల్లి జిల్లా పార్టీ జాయింట్ సెక్రెటరీ బొద్దాపు ఎర్రయ్య దొర. వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు. మండల పార్టీ అధ్యక్షులు కొల్లి త్రినాధరావు. కిషోర్ రాజు. దేశంశెట్టి శంకర్రావు. అచ్చి నాయుడు. మండల యూత్ అధ్యక్షులు దంతులూరి సంతోష్ వర్మ. జడ్పీటీసీలు సేనాపతి సంధ్యారాం. నర్మాల కుమార్. ఎంపీపీ లు గొట్టుముక్కల శిరీష శీను బాబు. కోన బుజ్జి ఎంపీటీసీలు. మాజీ సర్పంచులు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular