Thursday, April 16, 2026
HomeUncategorizedడిజిటల్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి: సిడిపిఓ ఎం. పూర్ణిమ

డిజిటల్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి: సిడిపిఓ ఎం. పూర్ణిమ

జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ మోసాల పట్ల మహిళలు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని, మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని జగ్గంపేట సిడిపిఓ (CDPO) ఎం. పూర్ణిమ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టు ఆధ్వర్యంలో ‘మిషన్ శక్తి’ పేరిట నిర్వహిస్తున్న 20 రోజుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జగ్గంపేట మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ‘సైబర్ భద్రత – డిజిటల్ అవగాహన’ సదస్సు నిర్వహించారు. మార్చి 2 నుండి 20వ తేదీ వరకు జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఐ (ASI) రాజశేఖర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వాడకంలో గోప్యత (Privacy) పాటించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఈమెయిల్స్, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకూడదు. ఆన్‌లైన్ వేధింపులు లేదా బెదిరింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసుల సహాయం కోరాలని కోరారు. “మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు, తమ కష్టార్జితాన్ని డిజిటల్ దొంగల బారిన పడకుండా కాపాడుకోవడమే కార్యక్రమంలో ఏపీఎం (APM) వై. ఉమా మహేశ్వరరావు, ఎంఎస్కే (MSK) రేవతి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు సునీత, అమ్మాజీ, మహిళా సంఘాల సభ్యులు మరియు అంగన్వాడీ టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular