Friday, June 5, 2026
HomeUncategorizedభవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలి ,సిఐటియు

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలి ,సిఐటియు

భవన నిర్మాణ కార్మికుల సమావేశాలు అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేట, కొండకర్ల, దోసూరు, అచ్చుతాపురం గ్రామంలో జరిగాయి .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము,కె. సోము నాయుడు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలని సంవత్సరాలుగా పోరాడితే నేడు సంక్షేమ బోర్డు ని పునరుద్ధరణ చేశారు కానీ భవన నిర్మాణ కార్మికులకు అందవలసిన 11 రకాల సంక్షేమ పథకాలు నేడు వివాహ కానుక పథకం, ప్రసూతి సహాయ పథకం, సహజ మరణ సహాయ పథకం ,అంత్యక్రియల ఖర్చు సహాయం పథకం వంటివి మాత్రమే అమలు చేస్తున్నారు గతంలో ప్రమాదవశాత్తు గాయాలు పాలైన ,మృతి చెందిన నష్ట పరిహారం ఇచ్చేవారు నేడవి ఆపివేశారు నాలుగు మాత్రమే అమలు చేయడం అన్యాయమని, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ బోర్డు కార్డులు ఇచ్చి పాతవి రెన్యువల్స్ చేయాలని పెండింగ్ క్లైములు మంజూరు చేయాలని ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనుసరిస్తున్న విధానాల వలన రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు పెరగడంతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని కార్మికులు వేతనాలు పెరగడం లేదని వెంటనే ఇటువంటి విధానాలు స్వస్తి చెప్పి ప్రజా అనుకూల విధానాల అవలంబించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు రాజన్న అప్పలనాయుడు ,పి రాజు, రమేష్, ఆర్ చిట్టిబాబు, వసంత, పైడిరాజు, హరి,కె రాజు చిన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular