Friday, April 17, 2026
HomeUncategorizedకూటమి ప్రభుత్వం లో గ్రామీణ ప్రాంతాలకు మహర్థశ

కూటమి ప్రభుత్వం లో గ్రామీణ ప్రాంతాలకు మహర్థశ

నక్కపల్లి, జిల్లావాణి
కూటమి ప్రభుత్వం లో గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని పెద్ద తీనార్ల ఎంపిటిసి మేరుగు నాగేశ్వరావు అన్నారు. మండలం లోని పెద్ద తీనార్ల గ్రామం లో హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు మేరకు 30 లక్షలు రూపాయలుతో సిసి రోడ్డు కు నిధులు మంజూరు అయ్యాయి.ఈ మేరకు రోడ్డుకు సంబందించిన పనులు మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో అభివృద్ధి కుంటుపడిందని ఎక్కడ చూసిన అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఇబ్బందులకు గురిఅయ్యారని మరల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ గోసల చిన్న తాతారావు, మహేష్, గిరీష్, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular