
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు..మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడడం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చారని అన్నారు. నేను తలపెట్టిన మిషన్ పునర్ వనం కార్యక్రమాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే విధంగా చర్యలు చేపడతామన్నడం తాను ఎమ్మెల్యేగా ఎలమంచి నియోజక వర్గ ప్రజలు ఎంచుకున్నందుకు తనకు దక్కిన విజయం గా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారి అనుకుని మొక్కలు పెంచడానికి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టడం,ఆటిజం గురించి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు.. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటిజం సంబంధించిన 125 కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ రెండు విషయాలు తాను ఎమ్మెల్యేగా ఉండగా ఒక అసెంబ్లీలో ప్రతిపాదించడం ఎంతో అదృష్టం అని అన్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలోని ఎంతో అభివృద్ధి పనులను చేస్తున్నామని త్వరలో పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి పట్టణంలోని లోపల ప్రాంతంలో ఉండటం వల్ల అత్యవసరంలో ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని దీని దృశ్య త్వరలో పాత ఆసుపత్రిలోనే వైద్య అన్ని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. అనంతరం అక్కడే నూతన ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధానంగా గాజువాక ఎలమంచిలి రోడ్డు విస్తీర్ణ పనుల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావించగా దీనిని సంబంధిత అధికారులను వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎండాకాలంలో మంచినీటికి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టామని ఇప్పుడు కూడా రెండు నెలలు ప్రతి ఇంటికి మంచి నీటి కులాయి ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నుండి నర్సీపట్నం కి వెళ్లే విధంగా రోడ్డును కూడా మన ఎలమంచిలి జాతీయ రహదారి అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశించానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎలమంచిలి మండలం పట్టణం ఈ జిల్లాలోనే ప్రధాన పట్టణముగా అభివృద్ధి చెందుతుందని దీనికి కారణం అటు అడ్డు రోడ్డు సమీపంలో నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారని, అచ్యుతాపురం వైపు మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయని నియోజకవర్గంలో ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని అక్కడే మెడికల్ కాలేజీ కూడా నిర్మాణానికి కృషి చేస్తున్నానని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటుకు ప్రభుత్వ అంగీకారం తెలిపిందని ఇందులో భాగంగా ఆ మెడికల్ కళాశాలను ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్మించే విధంగా తన కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు.తెలిపారు. నియోజకవర్గంలోని క్రీడలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అచ్చుతాపురంలోని క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలమంచిలి పట్టణంలోని రహదారిని త్వరలోనే వెడల్పు చేసి పనులను చేపడతారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోజనసేన నాయకులు పాల్గొన్నారు.
