జగ్గంపేట, ( జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 10:కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ.)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి. తిరుపతిరావును సోమవారం కాట్రావులపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో గండేపల్లి, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్ గా తిరుపతిరావు సమర్థవంతంగా పనిచేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సి.ఐ.గా కూడా శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడడంలో తనదైన ముద్ర వేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదంపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సబ్ ఇన్స్పెక్టర్ టి. రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

