Thursday, April 16, 2026
HomeUncategorizedకిశోర బాలికలందరూ హెచ్ పి వి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ను వినియోగించుకోవాలి ఎమ్మెల్యే బండారు

కిశోర బాలికలందరూ హెచ్ పి వి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ను వినియోగించుకోవాలి ఎమ్మెల్యే బండారు

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మహిళల సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఊబలంక పిహెచ్సి పరిధిలో కిషోర్ బాలికల కోసం ప్రభుత్వం అందిస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పీహెచ్సీ పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న క్యాన్సర్ వంటి మహమ్మారులను ఎదుర్కోవడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా 14 సం.ల వయస్సు నుంచి 15 సం.ల వయస్సు ఉన్న కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం ద్వారా వారు గర్భాశయ క్యాన్సర్ తోపాటు అనేక క్యాన్సర్ లకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కొనియాడారు. కిశోర బాలికలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించడం గొప్ప విషయమన్నారు. బయట మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ఖరీదు రూ.4వేల వరకూ ఉంటుందని, మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular