అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంటలో నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసినందుకు నిరసనగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ‘సమరభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ గొండు సిద్దు పిలుపునిచ్చారు.
ఆదివారం మండల కేంద్రం రోలుగుంటలోని జెడ్పీటీసీ పోతల లక్ష్మి శ్రీనివాస్ నివాసంలో మండల స్థాయి పార్టీ యువజన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు సిద్దు మాట్లాడుతూ.ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి 2025లో మెగా డీఎస్సీ నిర్వహించి, ఫలితాల విడుదలలో దగా చేసి ఎందరినో కూటమి ప్రభుత్వం ఉసురుపెట్టుకోవడం అన్యాయమన్నారు. అంతేకాకుండా ఒక్కో ఉద్యోగాన్ని సుమారు రూ.15 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పైసా లంచం లేకుండా ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. డీఎస్సీ-2025లో దగాపడిన వారికి న్యాయం కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ఈ మెగా డీఎస్సీ దగాపోరులో మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువజన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు టీవీ రవణ, ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీ యువజన విభాగం జిల్లా జనరల్ సెక్రటరీ సిద్దు పిలుపు మేరకు మండలంలో గల పార్టీకి చెందిన అన్ని పంచాయతీల సర్పంచులు, ఆయా సెగ్మెంట్ల ఎంపీటీసీలు, మండల కమిటీ, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలందరూ సహకరించాలని కోరారు. సోమవారం ఉదయం 08:00 గంటలకు అందరూ రోలుగుంట ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచే అందరూ కలిసి బయలుదేరుతారని వారు అన్నారు..
మెగా డీఎస్సీ దగా పోరును విజయవంతం చేయండి వైఎస్ఆర్సిపి యువత విభాగం సెక్రటరీ గొంది సిద్దు పిలుపు.
RELATED ARTICLES
