Thursday, April 16, 2026
HomeUncategorizedదళితలభూమి బలవంతంపు భూసేకరణ ఆపాలని 14రోజులనుండి దీక్ష లు సంఘిభవం తెలిపిన సిపిఎం

దళితలభూమి బలవంతంపు భూసేకరణ ఆపాలని 14రోజులనుండి దీక్ష లు సంఘిభవం తెలిపిన సిపిఎం

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం, పంచదార గ్రామంలో, దళిత రైతులు 14వ రోజు ఆందోళనలో భాగంగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు, కవులు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, కాండ్రేగుల సదాశివరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు, బొడ్డేడ రామ్ కుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాము, మండల కార్యదర్శి, జి. దేవుడు నాయుడు, సీనియర్ నాయకులు ఎస్ కన్నుమ్ నాయుడు సిఐటియు అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల కన్వీనర్లు కె సోమనాయుడు, సిహెచ్ రామకృష్ణమద్దతు తెలిపి మాట్లాడారు. మీరు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, అధికారులు, ప్రభుత్వం దళిత రైతులపై ఇంత నిర్లక్ష్యం సరికాదని, 50 ఏళ్ల క్రితం నుంచి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ భూములపై, సర్వ అధికారాలు పొంది, ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారాలు, సంక్షేమ పథకాలు, ఈ భూముల్లో జీడిమామిడి, కొబ్బరి, యూక్లిప్టస్, అరటి వంటి చెట్లు పల సాయం అనుభవిస్తున్న, దళిత రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జనసేన నాయకులు, కావడం వలన, డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ విషయంపై స్పందించి, దళిత రైతులను అన్ని విధాల ఆదుకోవాలని, వీరికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ప్రజాప్రయోజనాల రీత్యా అవసరమైనచో, దళిత రైతులను అన్ని విధాల ఆదుకున్నాకే భూములు తీసుకోవాలి కానీ, బలవంతంగా, దళిత రైతులను భయభ్రాంతులకు గురిచేసి, మీపై కేసులు పెట్టి జై లలో పెడతామని బెదిరించి, భూములు తీసుకుంటే, ఈ పోరాటాన్ని, జిల్లావ్యాప్తంగా దళితులందరిలో ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular