అచ్చుతాపురం మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంపీడీవోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్మిక సంఘం ఆడారి నాగేశ్వరరావు, సిఐటియు కన్వీనర్ కే సోమనాయుడు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులుగా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ గ్రామాల్లో కాలువలు రోడ్లు శుభ్రం చేస్తున్న వీరికి మాత్రం కనీస వేతనాలు అమలు చేయడం లేదు ప్రభుత్వం ప్రతి పంచాయతీలో పంచాయతీ కార్మికులకు నెలకు 10000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో అమలు కావడం లేదు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వేతనాలు పెంచడం లేదు దీంతో పంచాయతీ కార్మికులు అర్ధాకులతో జీవిస్తున్నారు ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి నెలకు 16,000 జీతం పెంచాలని ఈఎస్ఐ పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని బకాయి వేతనాలు ఇవ్వాలని పనిముట్లు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్ రాము, పంచాయతీ వియ్యపు లక్ష్మి ముప్పిడి కళ్యాణి దోసూరు నాగమణి బద్ది అప్పారావు తెల్లారి లక్ష్మి చేపల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

