
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరా జుకు ఘోర అవమానం జరిగిందంటూ పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గిరిజనులు నిరసన తెలియజేశా రు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన ప్రతిష్టింపబడ్డ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని జాతీయ రహదారి సిబ్బంది తాత్కాలికంగా తుప్పలలో వదిలిపెట్టారు. జాతీయ రహదారి పనులు పూర్తికావస్తున్న సమయంలో కూడా ఈ విగ్రహాన్ని గౌరవప్రద మైన స్థలంలో పెట్టడం జరగలేదు. దీనికి నిరసనగా కొండపల్లి గ్రామ పెస కమిటీ ఉపాధ్యక్షు డు కోటం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారి 516ఈ నిర్మాణం లో భాగంగా కొండపల్లి గ్రామంలో ఉన్న మహానీయుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని తొలగించి, ఇప్పటివరకు పునర్నిర్మాణం చేయకపోవడా న్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా కోటం వెంకటేశ్వ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం బాధాకరమని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని తక్షణమే గౌరవప్రదమైన స్థలంలో పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. విగ్రహం తొలగించి నెలలు గడుస్తున్నా హే్వే అధికారులు స్పందించకపోవడం ప్రజాభిమానాన్ని దెబ్బతీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కొండపల్లి ఇన్చార్జి పరిషిక సుమంత్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో గిరిజనులను మేల్కొల్పి విప్లవ శంఖారావం పూరించిన అల్లూరికి ఈ గ్రామంలో అవమానం జరగడం చాలా బాధాకరమైన విషయం అని, వెంటనే జాతీయ రహదారి సిబ్బంది విగ్రహాన్ని సరైన స్థానంలో నిలబెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబర్ పరిశిక సత్యనారాయణ, గ్రామప్రజలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.
