పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం మన్యం ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలంలోని కొండలింగంపర్తి గ్రామానికి చెందిన గిరి పుత్రిక దూరిపల్లి సునంద వై. రామవరం మండల ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుతు ఇటివలే నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో గర్వకారణంగా నిలిచింది. పరీక్షలలో1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42 గురుకుల పాఠశాలల్లో మునుపెన్నడూ ఈ స్థాయిలో ఏ విద్యార్థిని సాధించిని రీతిలో మొదటి స్థానంలో కైవసం చేసుకుంది. ఈ ఘన కీర్తి విశిష్ట విజయం సాధించిన విద్యార్ధినిని గుర్తించిన రాజవొమ్మంగి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు విద్యార్థిని స్వగ్రామమైన కొండలింగంపర్తికి వెళ్లి ఆమెను ఘనంగా సన్మానించారు. సునందకు సాలువా కప్పి, పళ్ళు మరియు స్వీట్స్ అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ రాజవొమ్మంగి మండలానికి చెందిన సునంద మంచి ఫలితాలను సాధించి తన కళాశాలకే కాకుండా తల్లిదండ్రులకు, గ్రామానికి, మొత్తం మండలానికి మంచి పేరు తీసుకొచ్చిందని కొనియాడారు. ఈక్రమంలో విద్యార్థిన్నీ ప్రోత్సహిస్తూ సునంద భవిష్యత్ విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని విధాలుగా తోడ్పడతానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం కొంత ఆర్థిక సహాయాన్ని కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో విద్యార్థినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జట్టి మధు, మరి చర్ల గోపి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
1000 మార్కులకు గాను “986 “సాధించిన గురుకుల పాఠశాల విద్యార్థిని
RELATED ARTICLES
