అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల కేంద్రంలో విజయవాడలో అంగనవాడిలా అరెస్టులకు నిరసనగా మానవహారం, ధర్నా , నిర్వహించారు.అంగనవాడిల సమస్యలు పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు ధర్నాశివరాల్లో కరెంటును కట్ చేసి దుర్మార్గంగా మహిళలని చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు గొలుగొండ ప్రాజెక్ట్ కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే అరెస్ట్ చేసిన అంగనవాడి వర్కర్స్ ను తక్షణమే విడుదల చేయాలన్నారు. అలాగే అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 42 రోజులు అంగనవాడి దీక్ష శిబిరాలు వద్దకు వచ్చి మద్దతు ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు అంగన్వాడీలపై నిర్బంధాన్ని విధించడం ఎంతవరకు సమంజస్వమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో మరింత ఉద్యమం తీవ్రతం చేస్తామని అంగన్వాడీ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ తెలపారు ఈకార్యక్రమంలో భవాని ,లక్ష్మీ ,రమణమ్మ మంగ తదితరులు పాల్గొన్నారు.


