Thursday, April 16, 2026
HomeUncategorizedపవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జగ్గంపేటలో ‘డొక్కా సీతమ్మ క్యాంటీన్’: తుమ్మలపల్లి రమేష్

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జగ్గంపేటలో ‘డొక్కా సీతమ్మ క్యాంటీన్’: తుమ్మలపల్లి రమేష్

జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 03:ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమావధిగా భావించిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జగ్గంపేటలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సొంత ఖర్చులతో సేవా యజ్ఞం జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘డొక్కా సీతమ్మ క్యాంటీన్’ ద్వారా సుమారు 500 మంది నిరుపేదలకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. ప్రతి మంగళవారం నాడు తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా ఈ సేవలు అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదారపు వీరబాబు, కురుమళ్ళ నాగేశ్వరరావు, సత్తి సోమరాజు, పాబోలు స్వామి, శ్రీను, డ్రిల్లు మాస్టారు, శ్రీమన్నారాయణ, మేడిబోయిన బాబురావు మరియు వీర మహిళలు గోపిక, అంబిక తదితరులు పాల్గొని స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా తమ నాయకుడు తుమ్మలపల్లి రమేష్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular