నక్కపల్లి, జిల్లావాణి
మండల కేంద్రం లో గల గ్రామ దేవత నూకాలమ్మ ఆలయం వద్ద కొత్త అమావాస్య సందర్బంగా నూకాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు బుధవారం ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఉత్సవ కమిటీ లో అధ్యక్షుడు గా వీసం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి గా కొప్పిశెట్టి వెంకటేష్ కార్యవర్గ సభ్యులు గా వీసం నారాయణరావు( నానాజీ)
మీగడ సత్య నారాయణమూర్తి, కోసూరు శ్రీను వాసరావు, అల్లాడ కొండబాబు, దేవవరపు లోవరాజు, కొల్నాటి దుర్గా ప్రసాద్, పెదిరెడ్డి రమేష్, అడ్డూరి నాగ భూషణం, పోలినాటి నానాజీ, దేవవరపు వెంకట సత్తియ్య, కొల్నాటి తాతాజీ, దేశెట్టి కృష్ణ, కర్రి శివ, ముద్దా శ్రీను వాసరావు, అల్లాడ తాతారావు, బొక్షు రాము, కొల్నాటి నానాజీ, మొటూరు ఈశ్వరావు, సకురు దుర్గ, మేనేజ్మెంట్ కమిటీ లో కర్రి వెంకట సత్య నారాయణ (కెవి )వీసం రాజు తదితరులు ఎన్నికైనారు. ఈ సందర్బంగా వీసం రామకృష్ణ, కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ నక్కపల్లి నూకాలమ్మ గా పేరు గాంచిన అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని ఈ ఏడాది అత్యంత భారీ ఎత్తున జాతర నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని గ్రామదేవత ఆశీస్సులు తో అంగరంగ వైభవం గా జాతర ఏర్పాట్లు కొరకు ఈ ఉత్సవ కమిటీ పనిచేస్తుందని అన్నారు.
నూకాలమ్మ జాతర నిర్వహణకు ఉత్సవ కమిటీ ఎన్నిక
RELATED ARTICLES
