*నక్కపల్లి, జిల్లావాణి
*మండలంలో గురువారం ఉదయం పలుపాఠశాలల్లో పి.ఆర్.టి.యూ సభ్యత్వనమోదుకార్యక్రమం జిల్లా అధ్యక్షుడు గోపీనాధ్ ఆదేశాలమేరకు మండలశాఖ పి ఆర్.టి.యూ అధ్యక్ష కార్యదర్శులు టి.వి.రమణ, ప్రగడ శివాజీల ఆధ్వర్యంలో చేపట్టారు.రెండవరోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో పెదబోదుగల్లం,నక్కపల్లి,ఉపమాక,నరసాపురం రాజయ్యపేట తదితర పాఠశాలలో ఉత్సాహంగా చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు అడిగిన సమస్యలను జిల్లా,రాష్ట్రప్రతినిధులకు తెలియజేసి వీలయినంతత్వరగా సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తామని వారు తెలిపారు.సమస్యలు ఉంటే నేరుగా తమకు తెలియజేయాలని వెంటనే పరిష్కరించడానికి తమ సంఘం ముందే ఉంటుందని వారు తెలిపారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యూనియన్ సభ్యులు వెలగా శేఖర్, సి.హెచ్.ప్రసాద్,రవి,నాగేశ్వరరావు,సుబ్బారావు,సి.హెచ్.శ్రీను, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
