పాయకరావుపేట , జిల్లావాణి
పాయకరావుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ధనిశెట్టి బాబురావు ఇటీవల అనారోగ్యంతో విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం స్వగృహానికి విచ్చేసిన సందర్బంగా గురువారం రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు పాయకరావుపేట లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ మేరకు బాబురావు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని వారు పార్టీలో చురుకుగా పాల్గొనేలా భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఎంపీ బాబురావు తో పాటు వైసిపి జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా , నక్కపల్లి మండలం పార్టీ అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నరసింహ మూర్తి , మాజీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ సోడిపల్లి శ్రీను ,కొంకిపూడి రామకృష్ణ, పెనుముచ్చు నాగేశ్వరావు , తదితరులు పరామర్శించారు.
ధనిశెట్టి బాబురావును పరామర్శించిన ఎంపీ గొల్ల బాబురావు
RELATED ARTICLES
