
భాష్యం స్కూల్ వార్షిక క్రీడోత్సవం ఘనంగా నిర్వహణ
ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ & అథ్లెట్ శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి.
నర్సీపట్నంలోని భాష్యం పాఠశాలలో నిన్న వార్షిక క్రీడోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ మరియు అథ్లెట్ శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, వివిధ రకాల విన్యాసాలు, స్పోర్ట్స్ ఫైనల్ ఈవెంట్స్, పిరమిడ్ ప్రదర్శన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వివిధ హౌస్‌లకు చెందిన పెట్రోల్ లీడర్స్ మార్చ్ ఫాస్ట్ చేస్తూ ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి మాట్లాడుతూ,
“క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం ,ఆత్మవిశ్వాసం, Character నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించగలరు” అని క్రీడల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు.
తదనంతరం వివిధ క్రీడా పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమం ముగింపులో భాష్యం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడోత్సవాన్ని విజయవంతం చేశారు.
