జగ్గంపేట, ఏప్రిల్ 16:ఇంటర్మీడియట్ ఫలితాల్లో జగ్గంపేటలోని శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు భారీ మార్కులతో ఉత్తీర్ణత సాధించి, పట్టణ స్థాయిలోనే అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. బైపీసీ సెకండియర్: విద్యార్థిని గోల్తి కృష్ణవేణి 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ నిలిచింది (హాల్ టికెట్ నెం: 2607229258), ఎంపీసీ విభాగం: విద్యార్థి లోహిత్ 1000 మార్కులకు గాను 983 మార్కులతో సత్తా చాటాడు. మొదటి సంవత్సరం: బైపీసీ విభాగంలో జోస్ 442/440 మార్కులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతూ.. విద్యా సంస్థను స్థాపించిన రెండు సంవత్సరాల నుండే వరుసగా టౌన్ ఫస్ట్ సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తమ కళాశాల 90 శాతం పాస్ పర్సంటేజీతో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసిందని ఆయన వెల్లడించారు. అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ బండారు నాగబాబు, డైరెక్టర్ శ్వేత, ప్రిన్సిపాల్ కాతేటి అభి మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కఠోర శ్రమ, అధ్యాపకుల నాణ్యమైన బోధన వల్లే ఈ విజయం సాధ్యమైందని వారు కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

