Friday, April 17, 2026
HomeUncategorizedఎస్. రాయవరం లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఎస్. రాయవరం లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

*ఎస్. రాయవరం లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు*
ఎస్.రాయవరం.జిల్లావాణి
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ పీ.మీనా కుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల పరిషత్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శిలను ఘనంగా సత్కరించారు.మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని మహిళలు పోటీతత్వంతో పనిచేయాలని ఎంపిడిఓ పేర్కొన్నారు. మహిళలు అసలైన సమాజ నిర్మాతలు అని వారి సేవలు ప్రశంస దాయకమని డిప్యూటీ ఎంపిడిఓ బంగారు సత్యనారాయణ పేర్కొన్నారు. మహిళలు అనాది కాలం నుండీ స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారని వారిని గౌరవించడం మనందరి బాధ్యత అని ఏవో రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ సతీష్ కుమార్ వివిధ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular