నక్కపల్లి,జిల్లావాణి
ప్రపంచానికి భారత్ శక్తిని చూపించి భారత క్రికెట్ జట్టు ఐసిసి పురుషుల టీ 20 ప్రపంచ కప్ లో విజయం సాధించిన సందర్బంగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ మరోసారి తన అద్భుతమైన ప్రతిభ చాటాడు. ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన గట్టెం వెంకటేష్ పెన్సిల్ ముళ్ళు పై తనదైన శైలిలో వరల్డ్ కప్ ట్రోఫీ ని పెన్సిల్ ముళ్ళు పై ఎత్తు 6ఎం.ఎం వెడల్పు 4ఎం.ఎం కొలతలు తో అతి సూక్ష్మం గా చెక్కి దేశం పట్ల తనకున్న దేశ భక్తిని చాటాడు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ భారతక్రికెట్ జట్టు మూడవ సారి ప్రపంచ కప్ సాధించడం సంతోషంగా ఉందని ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వ కారణం అన్నారు.ఈ సందర్బంగా వెంకటేష్ ను పలువురు అభినందించారు.
సూక్ష్మ కళాకారుడు అద్భుత ప్రతిభ పెన్సిల్ ముళ్ళుపై టీ 20వరల్డ్ కప్ ట్రోఫీ
RELATED ARTICLES
