
అనకాపల్లి జిల్లా యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ కనిపించకుండా(missing) పోయిన సంఘటనకు సంబంధించిన కేసు నమోదు చేయబడింది.ఫిర్యాదుదారు వెదుళ్ల నాగదేవి, భర్త లేట్ సకురు శ్రీనివాసరావు, వయస్సు 40 సంవత్సరాలు, నివాసం: సెయింట్ జూడ్స్ స్కూల్ దగ్గర, కొత్త ఎర్రవరం, యలమంచిలి మున్సిపాలిటీ, అనకాపల్లి జిల్లా, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమార్తె సాకురు సౌజన్య, వయస్సు 22 సంవత్సరాలు, తేదీ 06-03-2026 సాయంత్రం సుమారు 04.00 గంటల సమయంలో ఇంటి నుండి పాలు తీసుకురావడానికి షాపుకి వెళ్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.తదుపరి ఆమె కోసం బంధువులు మరియు పరిచయస్తుల వద్ద విచారణ చేయగా, పి. రాజా అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్లినట్లు తెలిసినది. అనంతరం సకురు సౌజన్య మరియు పి. రాజా ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న వివాహ ఫోటోలు ఫిర్యాదుదారుకు అందినట్లు తెలియజేశారు.తన కుమార్తె కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఫిర్యాదుదారు యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Woman Missing కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రస్తుతం కేసు విచారణలో ఉంది మరియు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సావిత్రి మీడియా కు తెలియజేశారు
