Friday, April 17, 2026
HomeUncategorizedప్రజలకు సేవ చేయడంలో సంతృప్తి వేరు వైస్ ఎంపీపీ ఇన్నం రమణ రత్నం.

ప్రజలకు సేవ చేయడంలో సంతృప్తి వేరు వైస్ ఎంపీపీ ఇన్నం రమణ రత్నం.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రస్తుత మండల పరిషత్ పాలకవర్గంలో వైస్ ఎంపీపీ గా బాధ్యతలు చేపట్టిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు అందిం చిన సేవలు తనకు ఎంతో సంతృప్తి నిచ్చాయని వైస్ ఎంపీపీ ఇన్నం రమణ రత్నం పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రగామిగా కొనసాగడం ఆనందంగా ఉందని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీపీగా సుర్ల రాజేశ్వరి, వైస్ ఎంపీపీగా తాను తోటి ఎంపీటీసీలు, అధికారులతోనూ స్నేహపూర్వకంగా మెలిగామని వెల్లడించారు. చెట్టుపల్లి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తమ గ్రామంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు వెనకాడనని పేర్కొన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే తన వద్దకు రావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తన విజయం వెనుక భర్త, కుటు ంబ సభ్యుల సహకారం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులు ఉన్నంతకాలం రాజకీయాలలో ఉంటానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular