Thursday, April 16, 2026
HomeUncategorizedపవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆకలి తీరుస్తున్న 'డొక్కా సీతమ్మ క్యాంటీన్'రెండేళ్లుగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్న...

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆకలి తీరుస్తున్న ‘డొక్కా సీతమ్మ క్యాంటీన్’రెండేళ్లుగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్న తుమ్మలపల్లి రమేష్జ

జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 10: నిరుపేద ప్రజల ఆకలి తీర్చడంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, గత రెండేళ్లుగా జగ్గంపేటలో నిర్విరామంగా ‘డొక్కా సీతమ్మ క్యాంటీన్’ నిర్వహిస్తూ ఆయన తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు.మంగళవారం జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రమేష్ స్వయంగా పాల్గొని పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని, ప్రతి మంగళవారం ఈ క్యాంటీన్ ద్వారా వందలాది మందికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు నిర్వహించిన అన్నదానంలో సుమారు 500 మందికి పైగా నిరుపేదలు భోజనం చేశారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రమేష్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నాయని జనసేన నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాదారపు వీరబాబు, కురుమళ్ళ నాగేశ్వరరావు, పాబోలు స్వామి, డ్రిల్ మాస్టర్, గంధం శ్రీనివాస్, సత్తి సోమరాజు, ఎర్రమల రాజు, ముత్యాల వెంకటరాజు, మండపాక పాపన్న దొర, ఎర్ర సాయి, రామకుర్తి శ్రీమన్నారాయణ, అడబాల వీరబాబు, యానాలా నాగేశ్వరావు, మెడిబోయిన బాబురావు, మేడిశెట్టి గోవిందు పాల్గొన్నారు. అలాగే వీర మహిళలు హై స్కూల్ చైర్మన్ వై. పద్మావతి, వంటేటి మల్లేశ్వరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular