Friday, April 17, 2026
HomeUncategorizedవైసిపిలో నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు వెల్లువ

వైసిపిలో నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు వెల్లువ

నక్కపల్లి, జిల్లావాణి
వైసిపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్రంలో వైస్సార్ సిపి మరింతగా బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం పలువురు నాయకులకు నూతన బాధ్యతలు అప్పగించడం జరిగింది.దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వైస్సార్సిపి ఇంచార్జ్ గా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను, అనకాపల్లి జిల్లా వైసిపి అధ్యక్షులు గా బొడ్డేడ ప్రసాద్ ను నియమించడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైసిపి కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో మండల నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular