Thursday, April 16, 2026
HomeUncategorizedచిన దొడ్డిగల్లులో ఉచిత కంటి వైద్య శిబిరం

చిన దొడ్డిగల్లులో ఉచిత కంటి వైద్య శిబిరం

నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని చిన్న దొడ్డిగల్లు గ్రామం లో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైస్కూలు విద్యార్థులకు బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు.
జాతీయ అందత్వ నివారణ సంస్థ( ఎం పి సి బి ), జిల్లా అంధత్వ నివారణ సంస్థ( డి బి సి ఎస్ ),సంయుక్తముగా రోగులకు ఉచిత కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. వృద్ధులకు,పిల్లలకు, మహిళలకు ఉచితముగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించారు.
ఈ కంటి వైద్య పరీక్షల్లో ద్రుష్టి లోపం ఎక్కువ గా ఉన్న రోగులకు ఉచితముగా ఆపరేషన్ చేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.
ఉచిత కంటి వైద్య శిబిరంలో, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. బాలాజీ, వ్యాయామ ఉపాధ్యాయురాలు డా. షహనాజ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శంకర్ ఫౌండేషన్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular