నక్కపల్లి, జిల్లావాణి
ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంద్రప్రదేశ్ గా చేయడమే కూటమి ప్రభుత్వ ద్యేయమని పాయకరావుపేట నియోజకవర్గం టిడిపి కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మండలం లోని గొడిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రి లో బుధవారం ఎంపిడివో చైతన్య, ఆసుపత్రి వైద్యులు తో కలిసి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని దీనిలో భాగంగా 14సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాధి రాకుండా ముందస్తుగా హెచ్ పీవి వ్యాక్సిన్ ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు పర్యవేక్షణ లో లభించే ఈ వ్యాక్సిన్ ఆడపిల్లలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కోసూరు శ్రీనివాసరావు, మండల బీజేపీ అధ్యక్షులు పోలినాటి నానాజీ,మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ, గ్రామ శాఖ అధ్యక్షులు నల్లల నారాయణరావు, ఐ టి డి పి ఇన్చార్జ్ బొండాడ రవిశంకర్, గెడ్డమూరి రమణ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు హెచ్ పీవి వ్యాక్సిన్ ఒక వరం
RELATED ARTICLES
