Thursday, April 16, 2026
HomeUncategorizedలారీ డ్రైవర్ ప్రాణాలు కాపాడిన కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

లారీ డ్రైవర్ ప్రాణాలు కాపాడిన కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన లారీ డ్రైవర్ కు 50 వేల రూపాయలు విలువచేసే ఇంజక్షన్లు అత్యవసరంగా అందించడం ద్వారా వైద్యులు ప్రాణాలను కాపాడారు ఛత్తీస్గఢ్ కు చెందిన అశోక్ జైస్వాల్ లారీ డ్రైవర్ రావులపాలెం కిరాయికి రాగా అక్కడ అతనికి త్రీవర గుండెలో నొప్పి రావడంతో రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అయితే ఆసుపత్రి వైద్యులు ఇది గుండెనొప్పిఅని చెప్పడంతో వారు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు నాగరాజు ,పూజిత వెంటనే అతనికి 50వేల రూపాయలు విలువచేసే ఇంజక్షన్ ను ఉచితంగా ఎక్కించడంతో ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడు ప్రైవేట్ ఆస్పత్రిలో 50వేల రూపాయలు తీసుకొని చేసే ఇంజక్షన్ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేయడంతో పేదలకు వైద్యం ఖర్చు తగ్గి ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు.ఈ సందర్భంగా సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించిన డాక్టర్లు నాగరాజు,పూజిత లను కొత్తపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular