కాకినాడ జిల్లా కిర్లంపూడి మార్చి 11:
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎక్సమ్ పేడ్స్ పంపిణీ చేశారు. హై స్కూల్ చైర్మన్ ఎలుగుబండి శ్రీను మరియు జనసేన పార్టీ నాయకులు కాయల మణికంఠ, పాలెం బాబీ, కాయల శ్రీను మరియు దానధర్మ ట్రస్ట్ నిధులతో పిల్లలకు ఎగ్జామ్ పాడ్స్ ఏర్పాటు చేసారు.. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ హాజరై విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేసి పిల్లలు అందరికీ అల్ ది బెస్ట్ తెలియచేసారు.. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతు భవిష్యత్తు కు 10 వ తరగతి తొలి మెట్టు అని, తామరాడ హై స్కూల్ లో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థాయి లో ఉన్నారు అని, ఇక్కడ ఫాకల్టీ మంచి విద్యబుద్దులు నేర్పిస్తున్నారు అని కాబట్టి అందరూ ఎగ్జామ్స్ బాగా మన తామరాడ హై స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు, అలాగే ఈ ఎగ్జామ్ పాడ్స్ కి నిధులు అందచేసిన హై స్కూల్ చైర్మన్ ఎలుగుబండి శ్రీను,గారికి, జనసేన నాయకులు కాయల మణికంఠ, పాలెం బాబీ, కాయల శ్రీను,దానధర్మ ట్రస్ట్ శివ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ గోకేడ రాజా,ప్రధానోపాధ్యాయులు కృష్ణ,కిర్లంపూడి మండలం ఉపాధ్యక్షులు సత్యంశెట్టి గణేష్, దాన ధర్మ ట్రస్ట్ అప్పికొండ శివ,తుంగపల్లి గోవింద్, స్టాఫ్ సెక్రెటరీ నూకరాజు మాస్టారు, కాయల వినయ్, తదితరులు పాల్గొన్నారు

