Saturday, June 6, 2026
HomeUncategorizedకాట్రావులపల్లిలో షర్మిలమ్మ ‘రచ్చబండ’ను జయప్రదం చేయండి: కాంగ్రెస్ నేతల పిలుపు

కాట్రావులపల్లిలో షర్మిలమ్మ ‘రచ్చబండ’ను జయప్రదం చేయండి: కాంగ్రెస్ నేతల పిలుపు

జగ్గంపేట, ( జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్రవ్యాప్తంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన “ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర — రచ్చబండ” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. స్థానిక జగ్గంపేట-గోకవరం రోడ్డులోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు, డీసీసీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, నియోజకవర్గ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ పాల్గొని ప్రసంగించారు. మార్చి 13వ తేదీ, సాయంత్రం 4:00 గంటలకు. జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామం. ముఖ్య అతిథి: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా 100 శాతం కేంద్ర నిధులతో విజయవంతంగా అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నేతలు మండిపడ్డారు. కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించడం ద్వారా కూలీల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. ఈ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిలారెడ్డి చేస్తున్న ఈ పోరాటానికి కాకినాడ జిల్లా ప్రజలందరూ సంఘీభావం తెలపాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పెద్దాపురం, కాకినాడ రూరల్, అర్బన్ ఇంచార్జీలు మాలకల సూరిబాబు, పిల్లి చిన్న, కాకినాడ సిటీ అధ్యక్షులు చెక్కా నూకరాజు, శ్రీ వత్సవాయి సత్యనారాయణ రాజు (అనే బాబు), డాక్టర్ నక్క సత్యనారాయణ, వైఎస్ సూరి ప్రకాష్ రావు, బొల్లం బాపిరాజు, ఎగుబాటి మహేష్, మాసార్ పాపారావు, కొలపర్తి వీర వెంకటరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular